Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఆటో డ్రైవర్లుగా ఉన్నారు

by Shamantha N |
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఆటో డ్రైవర్లుగా ఉన్నారు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని తెలిపారు. ఇది వారికి దేవుడు విధించిన శిక్ష అని చెప్పుకొచ్చారు. శుక్రవారం అయోధ్యలోని అసర్ఫీ భవన్ పీఠ్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ‘ఔరంగజేబు వారసులు కోల్‌కతా సమీపంలో నివసిస్తున్నారు. వారు ఆటో డ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్నారని కొందరు నాకు చెప్పారు. దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు ఔరంగజేబు పాల్పడ్డాడు. దేవుడ్ని ధిక్కరించకపోతే అతడి వారసులు అటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండకపోవచ్చు’ అని అన్నారు. ‘వసుధైవ కుటుంబం' (ప్రపంచం ఒకే కుటుంబం) అనే భావనను మనం పాటించామని గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో అన్ని వర్గాలకు ఆశ్రయం కల్పించిన ఏకైక మతం సనాతన ధర్మమని అన్నారు. అయితే, హిందువులకు ప్రతిఫలంగా అందిందా? అని ప్రశ్నించారు. కాగా, పొరుగుదేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య, సంభాల్, భోజ్‌పూర్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను ప్రస్తావించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసాన్ని ఆదిత్యనాథ్ హైలైట్ చేశారు. శతాబ్దాలుగా హిందూ దేవాలయాలు పదే పదే లక్ష్యంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది నిదర్శనమని అన్నారు. సనాతన ధర్మం, విలువలను కాపాడాలని సమాజాన్ని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed