AISF: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్.. డిమాండ్

by Ramesh N |
AISF: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్.. డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుకై అసెంబ్లీలో తీర్మానం చేయాలని అసెంబ్లీ (TG Assembly) ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వచ్చి ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సుమారు 50 మంది పైగా ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అంబర్‌పేట, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుకై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రను చేస్తున్నారని అన్నారు. విద్యారంగంలో పెండింగ్ బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదన్నారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story