- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arasavelli SuryaNrayanaSwamy Temple : రూ.100 కోట్లతో అరసవల్లి ఆలయం అభివృద్ధి : మంత్రి అచ్చెన్నాయుడు
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో అరసవల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu AchchennaNaidu) తన ఎక్స్(X) ఖాతా వేదికగా వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం(Srikakulam) సమగ్ర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రూ.100 కోట్లతో అరసవల్లి దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో పాటుగా అరసవల్లిలో జరిగే రథసప్తమి(RathaSapthami) వేడుకలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుుడు వెల్లడించారు. అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరి 4వ తేదీన అరసవల్లిలో రథసప్తమి వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.