బతుకుదెరువు కాపాడుకుందాం : కోదండరాం

by Shyam |   ( Updated:2021-01-01 03:51:07.0  )
Professor Kodandaram
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. అంతేగాకుండా వచ్చే ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ప్రజలు ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు నిఖార్సయిన మరో తెలంగాణ పోరాటం చేసేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వర్సిటీల్లో సగానికిపైగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న 2.25లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయడంలేదన్నారు. ‘బచావ్‌ యూనివర్సిటీ’ పేరుతో ఉద్యమిస్తామని తెలిపారు. ‘బతుకుతెరువు కాపాడుకుందాం’ పేరుతో జనవరి 3, 4వ తేదీల్లో ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. కాగా, నల్గగొండ- వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్‌ కోదండరాం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed