TTD : భక్తుల దర్శనాలపై టీటీడీ ఆంక్షలు.. టిక్కెట్స్ 5 వేలకు కుదింపు!

by srinivas |   ( Updated:2021-05-20 05:21:55.0  )
TTD : భక్తుల దర్శనాలపై టీటీడీ ఆంక్షలు.. టిక్కెట్స్ 5 వేలకు కుదింపు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేశస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెలలో భక్తుల దర్శనాల సంఖ్యను 5వేలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

గత ఏప్రిల్ నెలలో రోజుకు 15వేల టిక్కెట్లను టీటీడీ జారీ చేసిన విషయం తెలిసిందే. రేపటి నుంచి జూన్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో టీటీడీ వైబ్‌సైట్లో టిక్కెట్లను విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story