- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా గెలుస్తుందని చెప్పినందుకు సారీ : ఆస్ట్రేలియా కెప్టెన్
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ క్షమాపణలు చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియానే ఫేవరెట్ అని.. ఆ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించడం అసాధ్యమని పైన్ వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల సౌంతాప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియాపై కివీస్ జట్టు విజయం సాధించి తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీని ఎగరేసుకొని పోయింది. దీంతో టిమ్ పైన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నాడు. ఒక రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ న్యూజీలాండ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు. ‘మనం కొన్ని సార్లు తప్పుడు అంచనాలు వేస్తాము.
నేను కూడా అలాగే న్యూజీలాండ్‌పై ఇండియా గెలుస్తుందని భావించాను. అప్పుడు భారత జట్టు ఫామ్ చూసి నేను అలా ఊహించాను. కానీ న్యూజీలాండ్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ నాయకత్వం అందరినీ ఆకట్టుకున్నది. నేను ఆస్ట్రేలియాలోనే అత్యంత చిన్నరాష్ట్రమైన టాస్మానియా నుంచి వచ్చాను. అయినా సరే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాను. అలాగే చిన్న దేశమైన న్యూజీలాండ్ ప్రపంచవిజేతగా నిలవడం గర్వకారణంగా ఉన్నది’ అని టిమ్ పైన్ చెప్పాడు.