- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాయ్ ఫ్రెండ్ గుడ్డివాడైతే ఇన్ని లాభాలా?.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్ : పాపులర్ టిక్ టాక్ యూజర్ నియా ఎస్పరాంజ షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. అంధుడితో డేటింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుపుతూ రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన బాయ్‌ఫ్రెండ్ గుడ్డివాడు కావడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తెలిపిన నియా.. ఇందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటోంది.
స్పోర్ట్స్ పర్సన్, మోటివేషనల్ స్పీకర్, ఎంటర్‌ప్రెన్యూర్ అయిన నియా బాయ్ ఫ్రెండ్ జేక్ ఓల్సోన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటాడు. వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎప్పుడూ కలిసే కనిపిస్తారు. కాగా తన బాయ్ ఫ్రెండ్ అంధుడు కావడం అదృష్టమని రియా ఎందుకంటుందో కూడా వివరించింది.
1. ప్రతీ అమ్మాయి కోరుకునేది తన బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయిని చూడకూడదని. తనకు ఎలాగూ కళ్లు కనబడవు కాబట్టి ఆ సమస్యే లేదు.
2. పార్ట్‌నర్ కంటికి అందంగా కనిపించాలని అమ్మాయిలు హెయిర్ సెట్టింగ్, ఎక్స్‌ట్రా మేకప్‌పై కాన్సంట్రేట్ చేస్తారు. నాకు ఆ ప్రాబ్లమ్ కూడా లేదు.
3. బాయ్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇచ్చే ముందు తనకు కనిపించకుండా సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. తన నుంచి బహుమతులను దాచేందుకు ప్రయత్నిస్తారు. కానీ నాకు అలాంటి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. నేను చూపించినా సరే తను చూడలేడు కాబట్టి కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతాడు.
ఇక నియా నుంచి ఇలాంటి రీజన్స్ విన్న కొందరు నెటిజన్లు ‘నిజంగా గుడ్డితనం అదృష్టమని ఫీలవుతున్నావా? చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది’ అని ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం తన మాటలను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. గుడ్డితనం గురించి ఇలా మాట్లాడటం బాగాలేదని అంటున్నారు.