ఇన్నోవేషన్ చాలెంజ్ విన్నర్స్

by Harish |
ఇన్నోవేషన్ చాలెంజ్ విన్నర్స్
X

ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్‌ను రూపొందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్‌వేర్ టెకీలు, స్టార్ట్-అప్ కమ్యూనిటీలకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. అటల్ ఇన్నోవేషన్ మిషన్ – నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో భారతీయులు ఇప్పటికే ఉపయోగిస్తున్న అప్లికేషన్లలో ఉత్తమ దేశీయ యాప్స్‌ను గుర్తించడంతో పాటుగా, ప్రపంచస్థాయిలో అవి ఎంతవరకు నిలవగలవు? అనే విషయాలను గుర్తించి వాటికి క్యాష్ ప్రైజెస్‌తో ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ చాలెంజ్‌కు టెకీలు, ఇన్నోవేటర్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా టెక్ ఎంట్రప్రెన్యూర్స్ ఇందులో పార్టీస్‌పేట్ చేయగా, టిక్‌టాక్ ఆల్టర్నేటివ్ యాప్.. చింగారితో పాటు మరో 22 యాప్స్ ఇందులో విజేతలుగా నిలిచాయి. ఎలక్ట్రానిక్స్‌‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఈ విషయాన్ని ప్రకటించింది.

ఆఫీస్ ప్రొడక్టివిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఇ-లెర్నింగ్, ఎంటర్‌టైన్మెంట్, హెల్త్ & వెల్‌నెస్, అగ్రిటెక్, ఫిన్‌టెక్‌తో సహా వ్యాపారం, వార్తలు, గేమ్స్ ఇలా మొత్తంగా ఈ చాలెంజ్‌లో సుమారు ఎనిమిది కేటగిరీలకు చెందిన యాప్స్ పోటీపడ్డాయి. కాగా చింగారితో పాటు మీమ్ ఇండియా మూవ్‌‌, ‌‌సర్కార్‌‌, మైఐటీరిటర్న్‌ వంటి యాప్స్ విన్నర్స్‌గా నిలిచాయి

కేటగిరీల ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన యాప్‌‌కు రూ. 20 లక్షలు, రెండో స్థానంలో ఉన్న యాప్‌‌కు రూ. 15 లక్షలు ఇవ్వనుండగా.. మూడో స్థానంలో నిలిచిన యాప్‌‌కు రూ.10 లక్షలు అందిస్తారు. అంతేకాకుండా ఈ యాప్స్ మరింత అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. వీటిని జీఈఎంలో లిస్ట్ ‌చేస్తారు. కాగా, సెక్యూరిటీ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని విజేతలను సెలెక్ట్ చేశారు.

ఎంటర్‌టైన్‌మెంట్:

1. క్యాప్షన్‌ప్లస్
2. మీమ్‌చాట్

న్యూస్:

1. లాజికల్లీ
2. ఇజ్ఈక్వల్‌టూ

గేమ్స్:

1. హిట్‌వికెట్ సూపర్‌స్టార్స్
2. స్కార్‌ఫాల్ : ద రాయల్ కంబాట్
3. వరల్డ్ క్రికెట్ చాంపియన్‌షిప్ 2

ఆఫీస్:

1. జోహో వర్క్‌ప్లేస్ అండ్ క్లిక్
2. స్యూర్ఎమ్‌డీఎమ్

హెల్త్:

1. స్టెప్‌సెట్‌గో
2. ఐమామ్జ్

ఈలెర్నింగ్:

1. డిస్పజ్
2. కుటుకి కిడ్స్ లెర్నింగ్ యాప్
3. హలోఇంగ్లీష్ : లెర్న్ ఇంగ్లిష్

బిజినెస్:

1. జోహో ఇన్‌వాయిస్, బుక్స్ అండ్ ఎక్సెపెన్స్
2. మాల్91
3. జిమ్‌బుక్స్

సోషల్:

1. చింగారీ
2.యువర్ కోట్ అండ్ కూ

అదర్స్:

1. మేమైఇండియామూవ్
2. ఆస్క్ సర్కార్
3. మై ఐటీ రిటర్న్

Advertisement

Next Story

Most Viewed