- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘ఖాకీ’ల నిఘా నీడలో దుబ్బాక..
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణలో టెన్షన్ వాతావరణం సృష్టిస్తోంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య ప్రచార, మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే దుబ్బాక అభ్యార్థి రఘునందర్ రావుతో పాటు అతని బంధువుల ఇండ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ చర్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో అది కాస్త తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో సంజయ్ కు గాయాలయ్యాలని సమాచారం.
ఈ నేపథ్యంలోనే సిద్దిపేట కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. దాంతో పాటే బీజేపీ నేతలే టార్గెట్‌గా పోలీసులు డ్యూటీ చేస్తున్నారని కమలదళం సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని మెట్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారు డిక్కీలో ఉన్న సామగ్రిని పరిశీలించారు. అందులో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించకపోయే సరికి తిరిగి పంపించారు.