- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంజా విసిరిన పెద్దపులి.. కంటతడి పెట్టిన రైతు
by Aamani |

X
దిశ, బెజ్జూర్ : పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. ఈ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ రేంజ్‌లో బుధవారం వెలుగుచూసింది. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. బెజ్జూర్ గ్రామానికి చెందిన ఆత్రం బక్కయ్యకు చెందిన ఆవు మంగళవారం మేత కోసం బెజ్జూర్ అటవీ ప్రాంతానికి వెళ్లింది. మత్తడి స్ప్రింగ్ ఆనకట్ట సమీపంలో అకస్మాత్తుగా ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో పాడిపశువు అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, బెజ్జూర్ గ్రామానికి చెందిన సన్యాసి మంతయ్యకు చెందిన లేగదూడలు అటవీ ప్రాంతంలో తప్పిపోయాయి. వాటి జాడ నేటికీ కనిపించలేదు. పులి దాడిలో ఆవును కోల్పోయిన బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story