- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిలాబాద్‌లో పెద్ద పులి.. చిరుత పులి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెను గంగా తీరంలో పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఇరు రాష్ట్రాల రైతాంగాన్ని ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. పెన్ గంగాకు ఇరువైపులా… ఒకవైపు పెద్దపులి, మరోవైపు చిరుతపులి జనాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
ఇటు పెద్ద పులి…
తెలంగాణ, మహారాష్ట్ర నడుమ ఉన్న పెన్ గంగా నదికి ఇరువైపులా గత వారం పులుల సంచారం పెరిగింది. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం గొల్ల ఘాట్ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూముల్లో పెద్దపులి సంచరించినట్లు రైతులు తెలిపారు. అలాగే పెన్ గంగా నదీతీరంలో పెద్దపులి అడుగులను గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి అడుగుల నిర్ధారణ అనంతరం సమీప అటవీ గ్రామాల్లో పెద్దపులి సంచారాన్ని అధికారులు ధ్రువీకరించారు. గతంలో ఇదే గ్రామ సమీపంలో ఆవు, దూడలను పెద్ద పులి చంపేసింది. అప్పటినుంచి గ్రామస్తులు భయంతో ఉన్నారు. తాజాగా మళ్లీ పెద్ద పులి సంచారం గొల్ల ఘాట్ గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది.
అటు చిరుత పులి..!
ఇదిలా ఉంటే పెన్ గంగా కు అవతలివైపు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో చిరుత పులి ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో రెండు రోజులుగా చిరుతపులి వ్యవసాయ క్షేత్రాల్లో సంచరిస్తున్న ది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి చిరుతపులులు పెన్ గంగ పరిసరాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దు గ్రామం కోపామండి వ్యవసాయ భూముల్లో చిరుత పులి కనిపించింది. సోమ, మంగళ వారాల్లో ఈ గ్రామ పొలిమేరలో ఒక ఆవు దూడ పులి వేటాడి చంపింది. మళ్లీ చిరుత కనిపించడంతో ఆ గ్రామ రైతులు కర్రలతో చిరుత పులి ని వెంటాడారు. దీంతో పెన్ గంగానది గుండా చిరుత పులి పలాయనం చిత్తగించింది. అయితే మళ్ళీ ఈ చిరుత దాడి చేస్తుందోనని భయంతో పరిసర గ్రామాల ప్రజలు ఉన్నారు. ఇరువైపులా పెద్ద పులులు చిరుత పులుల సంచారం ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.