- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నో టిక్‌టాక్..
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో టిక్‌టాక్ వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవిత్రమైన సిక్కు మందిరమైన స్వర్ణ దేవాలయంలో అభ్యంతరకరమైన టిక్‌టాక్ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖల్ తఖ్త్ జాతేదార్ జియానీ హర్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఆలయ పరిధిలో టిక్‌టాక్ వీడియోలు నిషేధమంటూ గోడలపై పోస్టర్లు అతికించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, ఆలయంలో టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరణ జరగకుండా చూసేందుకు వాలంటీర్లను కూడా నియమించారు. అలాగే వీడియాలు తీస్తున్న వారిపై చీఫ్ మేనేజరు జస్వీందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మొబైల్ వినియోగాన్ని ఆలయ పరిధిలో నిషేధిస్తామని అఖల్ తఖ్త్ హెచ్చరించింది.