ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు

by Hamsa |
Panchangam
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి (నిన్న తెల్లవారుజాము 4 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 21 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర (నిన్న ఉదయం 12 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 53 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 54 ని॥ నుంచి తెల్లవారుజాము 5 గం॥ 39 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 10 ని॥ నుంచి 10 గం॥ 59 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 9 ని॥ నుంచి 3 గం॥ 58 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 48 ని॥ నుంచి 3 గం॥ 21 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి 10 గం॥ 41 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 15 ని॥ నుంచి 1 గం॥ 48 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 2 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : మిథునము

మేష రాశి : కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. దైవ ప్రార్ధన వలన పాజిటివ్ ఆలోచనలు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఆఫీసు పనుల మీద శ్రద్ధ పెట్టి సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి పై అధికారులు గమనిస్తున్నారు. వ్యాపారులకు వారు ఊహిస్తున్న లాభాలు రాకపోవచ్చు. ఆదాయం పర్వాలేదు అనుకోని ఖర్చులు వలన డబ్బుకి ఇబ్బంది. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారితో పరుషంగా మాట్లాడ కండి. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి. ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

వృషభ రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయ వ్యవహారాల గురించి కుటుంబ వ్యక్తులతో చర్చిస్తారు. మీ పెద్ద వారి ఆశీర్వాదాలు తీసుకోండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు నూనె వ్యాపారులకు మంచి లాభాలు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి సమయాన్ని వృధా చేయకండి. దీర్ఘకాలంగా బాధిస్తున్న అనారోగ్యం తగ్గుతుంది. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఇది ఒక ఆనందకరమైన రోజు.

మిధున రాశి : సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు గందరగోళం వదిలివేయండి. నిరుద్యోగులకు శుభవార్త. వ్యాపారంలో వ్యాపార విస్తరణ చేస్తారు. సీజన్ మార్పు వలన దగ్గు జలుబు. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. మీరు అప్సెట్ అవుతారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక అవసరం. ఇతరులకు అప్పు ఇచ్చే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితములో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసము సరైన ప్రణాళిక అవసరం. ఆఫీసులో మీ సీనియర్లతో సామరస్యంగా ప్రవర్తించండి. మరింత కష్టపడి పనులను సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారులకు లాభాలు. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించటానికి మంచి తరుణం. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. మీ ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఆదాయం పరవాలేదు దుబారా ఖర్చులను నివారించండి. కుదిరితే ప్రయాణాలను వాయిదా వేయాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

సింహరాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయటానికి మరింత కష్టపడండి. వస్త్ర వ్యాపారులకు మరింత లాభాలు. వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ పెద్ద వారి ఆశీర్వాదం తీసుకోండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి టీవీ మొబైల్ చూడటం వల్ల సమయం వృధా. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితులతో సాయంకాలం ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాలలో ఉన్న బంధువుల నుంచి వార్తలు అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

కన్యారాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. సరైన ప్రణాళికతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా మీ పిల్లలు చదువులను ఒక కంట గమనించండి. వారి బంగారు భవిష్యత్తు మీకు ఎంతో గర్వకారణం. వ్యాపారులు ముఖ్య నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. స్థిరాస్తి వ్యవహారాలలో లాభాలు. ఆఫీసు పనుల మీద శ్రద్ధ పెట్టండి సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

తులారాశి : ఆడుతూ పాడుతూ అనుకున్న కార్యాలను సాధిస్తారు. మెడిటేషన్ వలన మానసిక ప్రశాంతత. మీ కుటుంబ వ్యవహారాలలో కి ఇతరులను కలుగజేసు కోనీయకండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. దాని వలన ఒత్తిడి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దీర్ఘకాలంగా బాధిస్తున్న రోగం నయమవుతుంది. భాగస్వామ్య వ్యాపారులు వ్యాపారంలో జాగ్రత్త వహించండి. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. పాతబాకీలు వసూలవుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

వృశ్చిక రాశి : సహనంతో ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. గందరగోళం వలన పురోగతి సాధించలేరు. ఆఫీసు పనుల మీద శ్రద్ధ పెట్టండి లేకుంటే తప్పులు దొర్లే అవకాశం. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి సరైన ప్రణాళికతో ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆదాయం ఊహాలు మరింత మెరుగు పడతాయి. మీ కోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి. అధిక శ్రమ వలన బీరు నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

ధనస్సు రాశి : మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకోవడం వలన ఏ పని మీద ధ్యాస పెట్టలేరు. మెడిటేషన్ దైవప్రార్థన మంచి ఉపాయాలు ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. చాలా రోజుల తర్వాత మీకు విశ్రాంతి దొరికింది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ఒక శుభవార్త అందుతుంది. వ్యాపారులు డబ్బు ఇబ్బందుల నుంచి బయట పడతారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. సామరస్య ధోరణి వలన మీ వైవాహిక బంధం గట్టిపడుతుంది.

మకర రాశి : మీ ఉత్సాహం అంబరాన్ని అంటుతుంది. పట్టుదల ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. తొందరపడకండి. దుబారా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బును పాతబాకీలు తీర్చడానికి ఉపయోగించండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. మీ అత్తగారి తరపు నుంచి శుభవార్త అందుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొంతమందికి ఆఫీసు టూర్స్ ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కుంభరాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొన్ని నిర్ణయాలు మీ ప్రగతికి ఉపయోగపడతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు ఊహించని లాభాలు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. మీ అభిప్రాయాలను వారికి చెప్పండి కాని బలవంతంగా వారి మీద రుద్దకండి. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి : దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత. దైవప్రార్థన వలన పాజిటివ్ ఆలోచనలు. ఆఫీసులో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక వేయండి. ఎక్కువ విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ పెద్ద వారి ఆశీర్వాదాలు తీసుకోండి. కావలసినంత ధనం చేతికందుతుంది. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. బయటి తిండి వలన అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒకటి గుర్తు.

Advertisement

Next Story