- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ కట్టడాల కూల్చివేతపై చైర్మన్ ఆగ్రహం!
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తే అధి కార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల కనుసన్నలలో నడవకపోతే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు ఉన్నత స్థాయి అధికారులనే విషయాన్ని మరిచి అధికారం ఉందని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడా మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ కు దగ్గర వ్యక్తి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కమిషనర్ కూల్చివేశారు. ఈ విషయంపై చైర్మన్ ఇష్టానుసారంగా దుర్భాషలాడినట్లు జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలోనే తుక్కగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, 10వ వార్డు కౌన్సిలర్ రవిలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారంషోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల పరిధిలోని కొంగ ర్ఖుర్ధు రెవెన్యూ గ్రామంలో దాదాపు 2వేల ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. ఈ భూములను 14 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. వీరికి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్ ఉంది. ఈ క్ర మంలో అధికారులు కేవ లం ఒక్కరికే ఆరు ఎకరాలకు పాసుబుక్ ఇచ్చారు. పాసు బుక్ చేతికి రావడంతో ఆ వ్యక్తి ప్రహారీ గోడ, ఫెన్సింగ్ నిర్మించాడు.
ఈ విషయంపై మిగిలిన రైతులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీంతో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తుక్కగూడా కమిషనర్ జ్ఞానేశ్వర్ కు ప్రహారీతో పాటు ఏవైన నిర్మాణాలుంటే కూ ల్చివేయాలని మౌఖీక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశంతో ముందుకెళ్లిన కమిషనర్ కు మున్సిపల్ చైర్మన్ తో తిట్ల దండకం తప్పలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫెన్సింగ్, ప్రహారీ గోడ నిర్మించిన వ్యక్తి చైర్మన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో తట్టుకోలేకపోయారు. కష్టపడి కథ నడి పిస్తే చివరికి కమిషనర్ తనను సంప్రదించకుండా కూల్చివేయడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
అధికార పలుకుబడితోనే..
వక్ఫ్ భూముల సాగులో ఉంటున్నప్పటికీ పాస్ బుక్, రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదు. కానీ ఓ ప్రజా ప్రతినిధి అధికారిక పలుకుబడితో స్థానిక రెవెన్యూ అధికారులను తమ గుప్పిట్లోకి తీసుకొని ఒక్కరికే 6 ఎకరాల భూమికి పట్టా పాసుబుక్ జారీ చే యించడం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. పాసుబుక్ ఇప్పించడంతో లబ్ధిదారుడు తక్షణమే ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు.