దారుణం : పసిబిడ్డను హత్య చేసి..

by Sumithra |   ( Updated:2021-06-17 23:55:47.0  )
దారుణం : పసిబిడ్డను హత్య చేసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్ పరిధి అనాజ్‌పూర్లో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం ఎరుగని రెండు నెలల పసికందును నీటి ట్యాంకులో పడేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అనాజ్‌పూర్ గ్రామంలో నివాసముంటున్న మంచాల రంగయ్య అనే వ్యక్తి కూతురు అమ్మగారింటికి వచ్చింది. గురువారం రాత్రి నిద్రపోయిన తర్వాత ఆమె రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచి చూసే సరికి బాలుడు లేకపోవడంతో స్థానికులతో కలిసి చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ ఆచూకీ దొరకక పోవడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు, బాలుడి ఆచూకీ లభించకపోవడంతో… ఇంటిపైనున్న నీటిట్యాంకులో వెతకగా బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్య? ఇతర కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed