- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటల్లో ముగ్గురు యువతుల మిస్సింగ్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో యువతుల అదృశ్యం కలకలం రేపుతోంది. వివిధ కారణాలతో బయటికి వెళ్లిన యువతులు ఇంటికి తిరిగి రాలేదు. ఈ ఘటన లాలాపేట్, తిరుమలగిరి, చిలకలగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. లాలాగూడకు చెందిన కీర్తి ప్రజ్ఞ అనే యువతి.. గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కీర్తి ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
మరోవైపు తిరుమలగిరిలోని ఓ స్కూల్‌లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న మంజుల అనే యువతి.. గురువారం ఎప్పటిలాగే విధులకు వెళ్లింది.. కాసేపటి తర్వాత ఓ లెటర్‌ను కుటుంబసభ్యులకు ఇవ్వమని కొలీగ్స్‌కు ఇచ్చి వెళ్లింది. సాయంత్రం అయిన మంజుల ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీయగా సిబ్బంది ఆమె రాసిన లెటర్‌ను అందజేశారు. తనకు ఇంట్లో ఉండాలి అనిపించడం లేదని లెటర్ లో పేర్కొంది. దీంతో మంజుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిలకలగూడలోని శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన బండారి రోహిణి డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. బుధవారం రాత్రి ఇంట్లో అందరితో పాటు నిద్రపోయిన రోహిణి గురువారం తెల్లారేసరికి కనిపించడం లేదు. రోహిణికి సంబంధించిన వస్తువులు కనిపించకపోవడంతో ఉద్దేశపూర్వకంగా వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.