ఐపీఎల్ తిరిగి ఎప్పుడు?.. బీసీసీఐ ముందు మూడు ఆప్షన్లు

by Shiva |
ఐపీఎల్ తిరిగి ఎప్పుడు?.. బీసీసీఐ ముందు మూడు ఆప్షన్లు
X

దిశ వెబ్‌డెస్క్: దేశంలో కరోనా తీవ్ర ప్రతాపం చూపిస్తుండటం, ఐపీఎల్‌లో ఆడుతున్న పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడటం, ఐపీఎల్‌ను వాయిదా వేయాలని డిమాండ్లు వస్తున్న క్రమంలో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. వారం రోజుల తర్వాత ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా బీసీసీఐ వెల్లడించింది. కరోనా వ్యాప్తి క్రమంలో ఐపీఎల్ నిర్వహణపై మూడు ఆప్షన్లను బీసీసీఐ పరిశీలిస్తోన్నట్లు సమాచారం.

వివిధ చోట్ల కాకుండా ఒకే సిటీలో మ్యాచ్‌లు నిర్వహించే యోచన బీసీసీఐ చేస్తోందట. ఒకచోట నుంచి మరోచోటికి క్రికెటర్లు వెళ్లే సమయంలో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఒకే సిటీలో మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచన బీసీసీఐ చేస్తుందట. దానికి ముంబైను బీసీసీఐ ఎంచుకోనుందని వార్తలొస్తున్నాయి. దానికి కారణం ముంబైలోనే మూడు అంతర్జాతీయ స్టేడియంలు ఉండటమే.

ముంబైలో జింఖానా గ్రౌండ్, బ్రబోర్న్‌ స్టేడియం, వాంఖడే స్టేడియంలు ఉన్నాయి. దీంతో ఈ మూడు గ్రౌండ్‌లలో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముంది. ఇక రెండో ఆప్షన్‌గా జూన్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. వచ్చే నెలలో కరోనా ప్రభావం తగ్గే అవకాశముందని భావిస్తున్న బీసీసీఐ.. ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.

ఇక మూడో ఆప్షన్‌గా గత ఐపీఎల్‌లాగే ముంబైలో మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచన బీసీసీఐ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు ఆప్షన్లలో బీసీసీఐ తుది నిర్ణయం ఏది తీసుకుంటుందనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed