- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం టూ నాందేడ్ వయా హైదరాబాద్.. కొత్త గంజాయి రూట్
దిశ, చార్మినార్ : ఖమ్మం నుంచి నాందేడ్‌కు కారులో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాలోని నలుగురు వ్యక్తులను చాంద్రాయణగుట్ట పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం .. చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన మహ్మద్ అజర్ ఆలీ(36), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ మజర్ఆలీ(32) , యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ ఫిరోజ్(40), శంషాబాద్‌కు చెందిన షేక్ అష్రఫ్ పాషా(24)లు టిఎస్07 జిఎ 2390 నెంబర్‌గల మహేంద్ర ఎక్స్‌యూవీ కారులో ఈ నెల 2వ వతేదీన తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి నాందేడ్‌కు గంజాయిని తరలిస్తున్నారు.
మార్గమధ్యలో నల్లవాగు దగ్గర కారు ఆగి ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఎస్ఐ వెంకటేష్ బృందం ఆ కారును తనిఖీ చేయగా 8 సంచులలో నాలుగు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వారి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.