- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా సంఘం డబ్బులు మాయం
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని ఓ మహిళా సంఘం గ్రూపులో రూ.3 లక్షలు నిధులు మాయం కావడం కలకలం రేపుతోంది. వివరాళ్లోకి వెళితే… మండలంలోని బీరంగి పంచాయతీ కాచిపల్లె గ్రామానికి చెందిన రెండో గ్రామసమైక్యలోని జయలక్షి గ్రూప్‌లోని నిధులు భారీగా దుర్వినియోగం అయినట్టు సమాచారం. ఈ గ్రూపు సభ్యులకు సంబంధించిన రూ.3 లక్షల డబ్బు బ్యాంకులో ఉంది. అయితే దీనికి సంబంధిచిన పాసుబుక్కులు అన్ని మొదటి లీడర్ సుజాత వద్ద ఉన్నట్టు సమాచారం. దీంతో గతకొంతకాలంగా ఆమె లావా దేవిలు జరుపుతోంది.
ఈ క్రమంలో మినిట్స్ బుక్స్‌లో ఫోర్జరీ రసీదు పెట్టి లక్షల్లో డబ్బు స్వాహా చేసిందని సంఘం సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ… ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక ఎస్ఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ… ఒకే గ్రూపులో ఇంత పెద్ద మొత్తంలో నిధులు మాయం అవుతుంటే.. రికవరీ చేయాల్సిన పర్యవేక్షణ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారనే ప్రశ్నించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.