కొందుర్గులో ఒకే‌సారి మూడిళ్లలో చోరి

by Shyam |
కొందుర్గులో ఒకే‌సారి మూడిళ్లలో చోరి
X

దిశ, రంగారెడ్డి: మూడు కుటుంబాలు కలసి దావత్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు మూడిళ్లలో చొరబడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. కొందుర్గు మండల కేంద్రంలోని గౌడ్స్ కాలనీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండమల్ల శివకుమార్, పుష్పమ్మ, కందుకముల రమేశ్ గౌడ్ వారి కుటంబ సభ్యులతో కలసి పట్ణణంలోనే జరుగుతున్న ఓ పంక్షన్‌కి వెళ్లారు. తిరిగి వారు ఇళ్లకు వచ్చేసరికి తలుపులు తెరిసి ఉండటంతో షాక్ గురయ్యారు. శివకుమార్ గౌడ్ ఇంట్లో 2 తులాల బంగారం, 20 తులాల వెండి, 50 వేల నగదు దోచుకెళ్లారు. పుష్పమ్మ ఇంట్లో 1.50 లక్షలు.. రమేష్ గౌడ్ ఇంట్లో రూ.10,000లు చోరి అయినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed