వారికి మూడు మినహాయింపులు

by Shamantha N |
వారికి మూడు మినహాయింపులు
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మూడు మినహాయింపులనిచ్చింది. ట్రావెల్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలతో ఫ్లైట్‌లో వెళ్లే ప్రయాణికులకు ఈ మినహాయింపులు వర్తించనున్నాయి. ఇప్పటికైతే యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో భారత్ దేశాలతో పరస్పరం విమాన సేవలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఓసీఐ కార్డు కలిగిన ఈ నాలుగు దేశాల పౌరులు భారత్‌లో పర్యటించవచ్చునని కేంద్ర వైమానిక శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, చెల్లుబాటయ్యే వీసాలు కలిగిన ఉన్న భారతీయులూ ఆ దేశాలకు ప్రయాణించడానికి అనుమతినిచ్చింది. వారిపై ఎటువంటి నిబంధనలుండవని, సదరు దేశ ఎయిర్‌లైన్ మాత్రమే వీసా కేటగిరీపై నిబంధనలు పెడితే పెట్టొచ్చని వివరించింది. బిజినెస్, మెడికల్, ఉపాధి అవసరాల కోసం ఆ నాలుగు దేశాల పౌరులు భారత్‌కు పర్యటించవచ్చునని మూడో మినహాయింపునిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed