ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Sumithra |   ( Updated:2021-07-26 01:24:25.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో ఘోరం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ ధరణి కాటన్ మిల్ సమీపంలో ఎదరెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఎదురుగా వస్తున్న క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగి పోవడంతో ఎదురుగా వస్తున్న సాంట్రో కారుపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, రాజ లక్ష్మీ ,దేవాన్సు రెడ్డి గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story