- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
దిశ,బోథ్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్, ఇద్దరు ఐచర్ వాహనదారులు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి టమాటా లోడ్‌తో ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు అనంతపురం ధర్మారంకు చెందిన రామాంజనేయులు, ఖాజా, ట్రాక్టర్ వాహనదారుడు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకొలి గ్రామవాసిగా గుర్తింపు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం కాగా ట్రాక్టర్ వాహనానికి రాత్రి వేళల్లో ప్రమాదం జరగకుండా ఉండాల్సిన సూచిక (రేడియమ్స్) లేకపోవడంతో.. ఐచర్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ప్రమాదం సంభవించిందని SI తెలిపారు.