- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో ఎన్నికల చిచ్చు.. ముగ్గురు ఎంపీటీసీలు సస్పెండ్
దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కాంగ్రెస్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమై ప్రశాంతంగా ముగిసినప్పటికీ నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీటీసీలు సస్పెన్షన్‌తో రాజకీయ అలజడి మొదలైంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక అభ్యర్థికి బలపర్చాల్సిన కాంగ్రెస్ ఎంపీటీసీలు బలపర్చకపోవడంతో అట్టి నామినేషన్ స్క్రూటినీలో తేలిపోయింది. కేవలం ఒకే ఒక్క నామినేషన్‌తో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఏకగ్రీవమైంది. కాగా, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసినట్లుగా భావించి నర్సంపేట మండలం నుంచి తడుగుల రాంబాబు, ఖానాపూర్ మండలం నుండి బిక్కు లింగమ్మ, విజాకర్ రావు అనే ముగ్గురు ఎంపీటీసీలను సస్పెండ్ చేసినట్లు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. దీంతో ఖానాపూర్ కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది.