పడవ ప్రయాణం చేసిన ముగ్గురు అరెస్టు

by Shyam |   ( Updated:2020-03-29 21:46:16.0  )
పడవ ప్రయాణం చేసిన ముగ్గురు అరెస్టు
X

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి పడవ ప్రయాణం చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లిలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టా సరిహద్దును మూసివేశారు. దీంతో ఇరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా హైదరాబాద్‌లో ఉంటున్న బొరిచర్ల కృష్ణ తన స్వగ్రామమైన అద్దంకి వెళ్లేందుకు రవాణా మార్గం లేకపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తి ద్వారా నది మార్గం ద్వారా ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేందుకు రూ.2వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద ప్రకారం ఓ పడవ‌లో బైక్‌ను వేసుకొని ఇద్దరు శివాలయం సమీపం నుంచి పడవలో నది దాటుతుండగా కొందరు 100 నెంబర్‌కు
ఫిర్యాదు చేశారు. దీంతో వాడపల్లి పోలీసులు నది వద్దకు చేరుకొని ఆ ఇద్దరి తో పాటు పడవ యజమాని హనుమంతును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Tags: Three members, arrested, traveling, boat, TS, AP, Hyd

Advertisement

Next Story