ఆ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్..

by Sumithra |   ( Updated:2021-03-02 08:45:17.0  )
ఆ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్..
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌కు బెదిరింపు కాల్ వెళ్లింది. దీనిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌కు ఆదివారం రాత్రి ఓ అన్ నౌన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆగంతకుడు డిమాండ్ చేశాడు. ఈ విషయంపై సోమవారం రాత్రి.. పోలీసులకు ఎమ్మెల్యే కౌసర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కళింగరావు తెలిపారు.

కాగా ఆగంతకులు నేరుగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. సమాజంలో గుర్తింపు, ప్రభుత్వంలో హోదా, తగిన సెక్యూరిటీ కలిగిన వ్యక్తులకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనీ పలువురు చర్చించుకుంటున్నారు. ఆగంతకుడు గుర్తు తెలియని వ్యక్తి కావడంతో ఫోన్ నెంబరు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed