అన్నంత పని చేసిన కేఏ పాల్.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

by Mahesh |
అన్నంత పని చేసిన కేఏ పాల్.. సుప్రీంకోర్టులో పిటిషన్‌
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు (National President of the Praja Shanti Party) కేఏ పాల్ (KA Paul) తాను అన్నంత పని చేశారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న గేమింగ్, బెట్టింగ్ యాప్ లు (Gaming and betting app) వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేశారు. లేదంటే తానే సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయిస్తానని అన్నారు. ఈ క్రమంలోనే నేడు గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌పై కేఏ పాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ (Petition in the Supreme Court) వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్‌ కంటే ఈ గేమింగ్‌, బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమిని.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటాయని అన్నారు.

దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, నటులు, సెలబ్రిటీలను యువత, విద్యార్థులు రోల్ మోడల్‌గా తీసుకుంటారని, కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లుగా మారారని, ఈ క్రమంలో బెట్టింగ్, గేమింగ్ యాప్ లకు ప్రమోషన్స్ చేస్తున్నారని కేఏ పాల్ (KA Paul) మండిపడ్డారు. యువతను చెడు మార్గంలో నడిపే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రేటీలు, నటులు.. తమ తప్పును ఒప్పుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, వారి వల్ల నష్టపోయిన వారికి వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని..ఇది బెదిరింపు కాదని.. వారందరిని ఈడ్చుకెళ్తానని ఈ సందర్భంగా కేఏ పాల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Next Story

Most Viewed