ఎస్ఎల్బీసీ సొరంగంలో బయటపడ్డ రెండో డెడ్ బాడీ..

by Aamani |
ఎస్ఎల్బీసీ సొరంగంలో బయటపడ్డ రెండో డెడ్ బాడీ..
X

దిశ, అచ్చంపేట : ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 32వ రోజు మధ్యాహ్నం ఒకటి తర్వాత రెస్క్యూ బృందాలు కొనసాగించిన సహాయక చర్యలో రెండవ మృతదేహాన్ని వెలికి వెలికి తీసినట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మంగళవారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ అని నిర్ధారించారు. దాదాపు 18 దేశ అత్యున్నత రెస్క్యూ బృందాలు, ఉన్నత అధికారులు గడిచిన 30 రోజులకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో సొరంగంలోని 13.5 కిలోమీటర్ సమీపంలో మినీ జెసీబీ ద్వారా మట్టిని ఇతర శకలాలను తొలగిస్తున్న సందర్భంగా ముందుగా మృతుడు ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ చేతి బయటపడి దుర్వాసన వెదజల్లుతుండడంతో రెస్క్యూ బృందాలు ఆ ప్రదేశంలో దాదాపు నాలుగు గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. పార్థివదేహం వాహనంలో పోస్టుమార్టం నిమిత్తం ఎస్ఎల్బీసీ నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి పోలీస్ బందోబస్తు మధ్య తరలిస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed