- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెళ్లలేము.. ఉండలేము !
దిశ, న్యూస్ బ్యూరో: ఎంకి పెండ్లి సుబ్బి సావుకొచ్చిందన్నట్టయింది ఇప్పుడు హైదరాబాద్‌లోని హాస్టళ్లలో ఉంటున్న వారి పరిస్థితి. కరోనా వైరస్ (కోవిడ్ -19) కట్టడిలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అందరూ మద్దతునిస్తున్నవారే. ప్రత్యేకంగా నగరంలోని హాస్టళ్లలో ఉంటూ చదువులు, ఉద్యోగాలు చేస్తున్న వారూ సమర్థిస్తున్నారు. కాని లాక్‌డౌన్‌తో వారికీ కష్టాలు మొదలయ్యాయి. హాస్టళ్లు ఖాళీ చేయించొద్దని ఆదేశాలు ఉన్నా వారు సొంతూళ్లకు వెళ్దామని సిద్ధమవుతున్నారు. కాని వెళ్లే పరస్థితులు లేవు. దీంతో వెళ్లలేక..ఉండలేక ఆపసోపాలు పడుతున్నారు.
హాస్టళ్లలోనే ‘లాక్‌డ్’!
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, అశోక్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, హిమాయత్‌నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ ఏరియాల్లో వేల కొద్దీ హాస్టళ్లలోలక్షల మంది మహిళలు, విద్యార్థులు, విద్యార్థినులు కోచింగ్‌లకు వెళ్తున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉంటారు. జనతా కర్ఫ్యూకు ముందు రోజే నగరంలోని కొన్ని విద్యా సంస్థలు మూసేసుకున్నారు. మంగళవారం రాత్రి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో.. నగరంలోని ఇంకొన్ని సంస్థలూ తాళాలు వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో ఉంటున్న వారు సొంతూరుకు పయనమైదుమా..అని ఆలోచనలో పడ్డారు. అయితే, రవాణా వ్యవస్థ బంద్ కావడంతో ఎక్కడికక్కడ లాక్ అయిపోయారు. సొంత వాహనాలు ఉన్న వారు ఎలాగైనా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కాని పోలీసులు అడుగడుగునా దారి కాస్తున్నారు. కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తామనుకున్నా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, గుర్తింపు కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటికి వెళ్లే దారేది.!
ఉద్యోగాలకు ఎలాగో వెళ్లలేకపోతున్నాం.. హాస్టళ్లో ఉండలేకపోతున్నాం.. కనీసం ఇంటికైనా వెళ్దాబంటే బయట కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలు, బస్సులు నడవటం లేదు. సిటీలో ఎవరినీ తిరగనివ్వడం లేదు. నగరం దాటడమే గగనమంటే.. అక్కడి నుంచి సొంతూళ్లకు చేరుకోవడం సాహాసమనే చెప్పాలి. ఎవరి వాహనంలోనైనా లిఫ్ట్ అడిగి వెళ్దామన్నా ఎవరూ ఆపడం లేదు. ఒకవేళ బైక్ పై ఇద్దరూ వెళ్తే పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. నిబంధనలు తెలిసినా సరే ఇంటికి వెళ్లాలంటే ఏదో ఒక ప్రత్యామ్నాయం వెతుక్కోకతప్పదన ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావణి వాపోయింది. ఇంకా నెల రోజుల పాటు హాస్టళ్లలో వసతి ఉండదు. నగరంలో ఎక్కడికి వెళ్లలేం.. ఇంటికి వెళ్తామంటే సౌకర్యాలు లేవు ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, లింగంపల్లి, బాలానగర్ చౌరస్తాలకు వందల సంఖ్యలో రోజూ చేరుకుంటున్నారు. కొన్ని చోట్ల లిఫ్ట్‌లపై వస్తున్నవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
కర్నాటక, జహీరాబాద్, నారాయణఖేడ్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన వాళ్లు నగరం దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రిళ్లయితే కొంత వెసులుబాటుగా ఉంటుందని అర్ధరాత్రిళ్లు హాస్టళ్లు దాటి వస్తున్నారు. నడుచుకుంటూ, ఎదురొచ్చినా ప్రతి వాహనాన్నీ లిప్ట్ అడిగి వెళ్తున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని సహకరిస్తున్న వారిని పోలీసులు ఏమనొద్దని వరంగల్‌కు చెందిన ప్రశాంత్ కోరుతున్నాడు. నెల రోజులు హాస్టల్లో ఉండనివ్వడం లేదనీ, తనకు తెలిసిన వారు కూడా లేరని అతడు వివరించాడు. ఇలా అనేక మంది నగరంలో ఉండలేక, ఇంటికి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. వెళ్లినా వాళ్లు రానిస్తారన్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో తమను సొంతూళ్లకు వెళ్లేందుకు కొంత మినహాయించాలని హాస్టళ్లలో ఉంటున్నవారు కోరుతున్నారు.
tags : hostels in hyderabad, coronavirus (covid-19), effect, closing