- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి’
దిశ, అశ్వారావుపేట: అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపరి భాగం వెంకటేశ్వరరావు, పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన సమయంలో బీట్ ఆఫీసర్ మదన్ లాల్ చిత్ర హింసలకు గురి చేయడం వలనే, వెంకటేశ్వరరావు మృతి చెందాడని న్యూడెమోక్రసీ నాయకులు పద్దం వెంకన్న ఆరోపించారు. మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ఫారెస్ట్ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల పోడు సాగుదారులపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని దానికి ఉదాహరణ భాగం వెంకటేశ్వరరావు మృతి అని ఆరోపించారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవులూరి మధు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఉమర్, డివిజన్ నాయకులు సురేందర్, వెంకట్రావు, సీతరాములు, తదితరులు పాల్గొన్నారు.