విద్యార్థులకు బ్యాగులు, బట్టలు పంపిణీ చేసిన తోపుడు బండి ఫౌండేషన్

by Sridhar Babu |   ( Updated:2021-11-16 07:01:20.0  )
Dhusthuvula-pampini-1
X

దిశ, కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పాయపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం తోపుడు బండి ఫౌండేషన్ అధ్యక్షుడు సాదిక్ అలీ సందర్శించి పాఠశాల పరిస్థితుల గురించి స్కూల్ హెచ్ఎమ్ ను అడిగి తెలుసుకున్నాడు. వెంటనే స్పందించి, 25 మంది విద్యార్థులకు రెండు జతల బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, పెన్సిల్స్ విద్యార్థులకు అందజేశాడు. ఈ సందర్భంగా సాదిక్ అలీ మాట్లాడుతూ స్కూల్ లో పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టిక ఆహారం అందించాలన్నారు. స్కూల్ కు సంబంధించి గానీ, విద్యార్థుల విషయంలో గానీ ఎలాంటి సమస్యలు ఉన్నా తమ సంస్థ ద్వారా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ కు పంపించాలన్నారు. అదేవిధంగా పిల్లలు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చల్లగుండ్ల నరసింహారావు, విజయ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed