థామస్ అండ్ ఉబెర్ కప్ వాయిదా?

by Shyam |   ( Updated:2020-09-14 09:00:15.0  )
థామస్ అండ్ ఉబెర్ కప్ వాయిదా?
X

దిశ, స్పోర్ట్స్: కోవిడ్ కాలంలో థామస్ అండ్ ఉబెర్ కప్ నిర్వహించడంపై పలు వైపుల నుంచి విమర్శలు పెరిగిపోవడంతో ఈ ఏడాదికి ఈ టోర్నీని రద్దు చేయాలని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయించినట్టు సమాచారం. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మలేషియాకు చెందిన ఒక అధికారి చెప్పిన వివరాల మేరకు.. సోమవారం జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని బీడబ్లూఎఫ్ రద్దు చేసింది. అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని ఆర్హస్‌లో థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్ జరగాల్సి ఉంది.

అయితే కోవిడ్ కారణంగా పలు దేశాల బ్యాడ్మింటన్ అసోసియేషన్లు ఈ టోర్నీలో పాల్గొనడానికి నిరాకరించాయి. దీంతో ఈ ఏడాదికి టోర్నీని రద్దు చేయాలని లేదా వచ్చే ఏడాది టోక్యో ఒలంపిక్స్ తర్వాత నిర్వహించాలని బీడబ్ల్యూఎఫ్ భావిస్తున్నది. ఈ నిర్ణయాన్ని బీడబ్ల్యూఎఫ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఇండోనేషియా, సౌత్ కొరియా, థాయ్‌లాండ్ సహా ఏడు అసోసియేషన్లు థామస్ అండ్ ఉబెర్ కప్‌లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పాయి. ఇండియన్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా కోవిడ్ నేపథ్యంలో ఈ టోర్నీని ఎలా నిర్వహిస్తారని ట్విట్టర్‌లో ప్రశ్నించింది.

Read Also…

‘ధోనీ ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలడు’

Advertisement

Next Story

Most Viewed