‘కమలా’నామధేయులకు బంపర్ ఆఫర్

by Shyam |
‘కమలా’నామధేయులకు బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కెటింగ్‌లో భాగంగా కంపెనీలు భిన్న ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తమ కంపెనీ పేరుతో మ్యాచ్ అయ్యే పేరు పెట్టుకుంటే 20 ఏళ్ల పాటు వైఫై ఉచితమని, లైఫ్ లాంగ్ బర్గర్ ఉచితంగా అందిస్తామనే ప్రకటనలు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి. ఇండియాలో ఇలాంటి ప్రకటనలు అంతగా కనిపించవు కానీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ పుణ్యమా అని ‘కమల’ పేర్లున్న వారికి ‘వండర్‌లా’ ఓ అద్భుతమైన సండే ఆఫర్ అందిస్తోంది.

అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి భారతీయ సంతతి మహిళగా కమలా హ్యారీస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజున, తన పూర్వీకుల గ్రామం(తమిళనాడులోని తులసేంద్రపురం)లో అన్నదానం, క్షీరాభిషేకాలు, మిఠాయి పంచడం, బాణసంచా పేల్చడం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ఆమె ప్రమాణ స్వీకరణ మహోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోగా, ఈ క్రమంలో ఆమె విజయాన్ని పురస్కరించుకుని కమలా, కమల్, కమలం వంటి పేర్లున్న వారికి ఈ నెల 24(ఆదివారం)న ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇండియన్ ఎమ్యూజ్‌‌మెంట్ థీమ్ పార్క్‌ వండర్‌లా(Wonderla) ప్రకటించింది.

హైదరాబాద్, కోచి, బెంగళూరులలో వండర్‌లాకు బ్రాంచెస్ ఉండగా, అంతటా ఈ ఆఫర్ వర్తిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ పేరు కమలా? ఫార్క్ ఎంట్రీ ఫ్రీ’ అనే పోస్టర్ విడుదల చేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్‌లో మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వాళ్లు తెలిపారు. ఒకవేళ మీ పేరు కమలా, కమల్, కమలం, అయితే దానికి రుజువు చూపించే గుర్తింపు కార్డును వెంట తీసుకెళితే సరి..మీరు పార్కులోకి ఫ్రీగా ఎంటర్ కావచ్చు.. సో ‘కమల’నామధేయులకు ఈ సండేను ఆసాంతం ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది. ఆశించి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఇక మీ చాయిస్.

Advertisement

Next Story