- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో మొదటగా ఈమెలోనే ఒమిక్రాన్ లక్షణాలు బయటపడ్డాయి?
దిశ, వెబ్ డెస్క్: ఒమిక్రాన్.. ఇప్పుడిది ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే కరోనాతో ఇన్నాళ్లపాటు ఇబ్బంది పడిన ప్రపంచం ఇప్పుడు మరోసారి కొత్త వేరియంట్ తో గజగజ వణుకుతోంది. పలు దేశాలలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఒమిక్రాన్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు విమానాశ్రమంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. మరికొన్ని దేశాల్లో అయితే విమానాల రాకపోకలనే రద్దు చేశారు. మన దేశంలో కూడా నిబంధనలను కట్టు దిట్టం చేశారు. అయితే, కేరళలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు టెస్టులు చేయగా ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
అయితే, మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెల్వగానే.. మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు ఎక్కడ నమోదైంది.. ఎవరికి సోకింది.. వాళ్లెవరూ అని సోషల్ మీడియాలో తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం మన దేశంలో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. ఆ ఇద్దరిలో మొదటగా మహిళా డాక్టర్ కు ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. ఆమె విదేశాల్లో డాక్టర్ గా సేవలందిస్తున్నట్లు తెలిసింది. బెంగళూరుకు చెందిన ఆమె వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు అని తెలిసింది.