- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగానామ @యోగ, ఆయుర్వేదం, ఫిలాసఫీ
దిశ, ఫీచర్స్: వేదకాలం నుంచే భారతదేశంలో యోగా ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి. కొన్నేళ్ల పాటు ఏసీ గదుల్లో, ఇనుప పరికరాలపై చెమటోడ్చిన భారతీయులు, ప్రస్తుతం పాత పద్ధతులకు తిరిగి వెళుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో జిమ్‌లు మూసివేయడంతో చాలామంది తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కరోనా వల్ల నెలకొన్న భయాందోళనలను తొలగించుకోవడానికి యోగా చేయడం ప్రారంభించారు. భారతీయులే కాదు విదేశీయులు సైతం యోగా వైపు మొగ్గు చూపారు. కొవిడ్ వంటి మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయుర్వేదం, యోగా గురించి నమితా పిపరయ్య అందించే సలహాలు అమూల్యమైనవి. టాటాస్కై, వూట్, డిస్నీ + హాట్‌స్టార్, క్యూర్.ఫిట్‌తో సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ‘యోగానామ’ పేరుతో నమితా అందించే వీడియోలను లక్షలాంది మంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేద, యోగాపై నమిత అందించే విశేషాలు మీ కోసం..
కల్ట్.ఫిట్, సర్వా వంటి యాప్స్, వెబ్‌సైట్స్ వ్యాయామ మెళకువలు నేర్పించడానికి డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నాయి. యోగా ప్రాక్టీషనర్లు, టీచర్లు కూడా లైవ్ క్లాసులు నిర్వహించేందుకు మొగ్గు చూపారు. ముంబైకి చెందిన యోగా శిక్షకురాలు నమితా పిపరయ్య అందులో ఒకరు. సిటీబ్యాంక్, అవివా, జనరల్లి వంటి ఎంఎన్‌సీలలో సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన తర్వాత ఆమె హఠా యోగాలో 700 గంటలకు పైగా యోగా అలయన్స్ సర్టిఫికేట్ శిక్షణను పూర్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ సంస్థలు, ఉపాధ్యాయుల ద్వారా ప్రాణాయామం, ఆయుర్వేదం, యోగా తత్వశాస్తాలను నేర్చుకుంది. అంతేకాదు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి మ్యాథ్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్, సింబియోసిస్ నుంచి ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. హర్యానాలో పుట్టిపెరిగిన నమిత ప్రస్తుతం యోగా శిక్షకురాలిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంటుంది. వరల్డ్ టాప్ ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆయుర్వేద యోగా క్లాసులు చెబుతోంది.
2018లో ముంబైకి చెందిన యోగానామా వెల్‌నెస్ ఎల్ఎల్‌పీని స్థాపించింది. పురాతన పద్ధతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో యోగా తన యోగానామ ద్వారా యోగ, ఆయుర్వేదాలను ఒకే రూఫ్ కిందకు తీసుకొచ్చింది. విజన్, మిషన్‌తో కూడిన ‘గోల్ సెట్టింగ్’ వ్యాయామం ఇక్కడ అందిస్తుంది. పర్యావరణంలో మార్పులు లేదా అనుభవాలతో నిరంతరం ఈ పద్ధతిలో మార్పులు తీసుకు వస్తుంది. ‘ఆయుర్వేద-యోగా ’ కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. ఆయుర్వేదం ఒక వ్యక్తి యూనిక్ పర్సనాలిటీ టైప్ ఆధారంగా నిర్దిష్ట ఆహారం, మూలికలు, జీవనశైలిని సిఫారసు చేస్తుంది. అంతేకాదు ఇది యోగా భంగిమలు, యోగా స్టైల్స్ కూడా సూచిస్తుంది. యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రాలను రోజువారీ జీవితంలో భాగం చేయడమే యోగానామ లక్ష్యమని నమిత వివరిస్తోంది. సంప్రదాయ హఠా యోగా పద్ధతులను ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రం, మూవ్‌మెంట్ సైన్స్‌తో అనుసంధానించే సమగ్ర యోగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి ఆమె ప్రయత్నాలు చేస్తోంది.
అందరికీ పీస్ ఆఫ్ మైండ్ కావాలి..
నేను పనిచేస్తున్న ఎంఎన్‌సీలో ప్రమోషన్ ఇచ్చినప్పుడు, నా కెరీర్ మరింత ఉన్నతస్థితికి వెళ్లేది. కానీ నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. అదొక గొప్ప అవకాశం కానీ అది నాలో ఉత్సాహాన్ని నింపలేదు. అంతేకాదు నాకిష్టం లేని దానికోసం మరింత బాధ్యత పెంచుకోవడం నాకు నచ్చలేదు. నా శక్తియుక్తులను నేను నమ్మిన దానికోసం వెచ్చించాలనుకున్నాను. ఈ రోజు అందరికీ ‘పీస్ ఆఫ్ మైండ్’ కావాలని నమ్ముతాను. ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో అందరికీ అవసరమైన వీడియోలు అందిస్తుంటాను. ప్రతీ ఒక్కరి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడంలో ‘ఫిలాసఫి’ సాయపడుతుంది. ఈ సూత్రాలు, అభ్యాసాలను ఒకరి దినచర్యలో భాగం చేసి, వారి ఆరోగ్యం, ఆనందాన్ని పెంచడంలో యోగానామ ప్లాట్‌ఫాం సాయపడుతుంది. యోగా అనేది కేవలం ఆసన సాధన మాత్రమే కాదు. జీవితంలోని ప్రతీ అంశంలో సంబంధాల నుంచి శారీరక ఆరోగ్యం వరకు, ప్రజలకు సహాయపడే జీవనశైలి అని అవగాహన కల్పించడమే నా లక్ష్యం. యోగా, ఆయుర్వేదం, ఫిలాసఫీ మూడింటినీ మన జీవితంలో అప్లయ్ చేస్తే పాజిటివిటీ పెరుగుతుంది. ఆరోగ్యం మెరగవుతుంది. ఉత్తమమైన జీవనాన్ని కొనసాగించొచ్చు.
– నమితా పిపరయ్య, యోగా, ఆయుర్వేద శిక్షకురాలు