- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డీలిమిటేషన్ ఇష్యూపై ప్రధాని మోడీకి మాజీ సీఎం జగన్ లేఖ

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం భారతదేశంలో డీలిమిటేషన్ (Delimitation) పై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM Stalin) చెన్నై వేదికగా ఈ రోజు అఖిలపక్ష సమావేశం (All-party meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్డీయే కూటమి (NDA alliance)లోని పార్టీలు మినహా.. అన్ని పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ (Former AP CM Jagan) డీలిమిటేషన్‌పై ప్రధాని మోడీ (Prime Minister Modi)కి వైఎస్ జగన్ (YS Jagan) లేఖ (Later) రాయడం హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం తన లేఖలో.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని ప్రధాని మోడీని జగన్ కోరారు. అలాగే 2026 లో జరిగే డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొందని.. ఈ డీలిమిటేషన్ వల్ల.. ఎంపీ సీట్లు (MP seats) తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇలా జరిగిందని.. ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ (Delimitation according to the census) చేస్తే సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ (Delimitation) జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.