- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకట్టుకుంటున్న ‘వ్యాక్సిన్ ఆటో’
దిశ, ఫీచర్స్: కరోనా వైరస్ ఎంత భయంకరమైందో వివరించడానికి పోలీసులు, స్వచ్ఛంద కార్యకర్తలు యముడి వేషధారణలో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. కొవిడ్ నిర్మూలించడానికి ఏడాదిన్నర పాటు అహర్నిశలు కష్టపడి వ్యాక్సిన్ తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. అయితే విస్తృతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్నా, సోషల్‌మీడియా తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో టీకాపై అపోహలు, భయాలున్నాయి. ఆ సందేహాలను, అపోహల్ని నివృత్తి చేసేందుకు వైద్యులు, సెలబ్రిటీలు, సామాజికవేత్తలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీకాపై అవగాహన కల్పించేందుకు చెన్నైకి చెందిన ఆర్టిస్ట్ గౌతమ్ వినూత్నంగా ‘వ్యాక్సిన్ ఆటో’ను రూపొందించాడు.
చెన్నైలో ఆర్టిస్ట్ గౌతమ్‌కు చెందిన సంస్థ‘ఆర్ట్ కింగ్‌డమ్’, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌తో కలిసి వ్యాక్సిన్ ఆటోను రూపొందించింది. టీకా గురించి ప్రజల్లో భయం పోగొట్టేందుకు రెండు నెలల క్రితం ఆటో డిజైన్‌కు సంబంధించి చెన్నై కార్పొరేషన్‌కు వివరించగా.. ఐడియా బాగుండటంతో కార్పొరేషన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో కేవలం పదిరోజుల్లోనే ‘టీకా ఆటో’ రూపొందింది. ఆటోరిక్షా ముందు, వెనుక టీకాలను పోలిన సిరంజీలతో డిజైన్ చేయగా, పైన వ్యాక్సిన్ సీసా నమూనాను ఉంచాడు. తెలుపు-నీలం రంగులోని ఈ త్రిచక్ర వాహనం చెన్నై వీధుల్లో ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. దీన్ని వేస్ట్ పైప్, బాటిల్, ప్లైవుడ్ వంటి మెటరీయల్‌తో రూపొందించడం విశేషం. ఇరుకైన మార్గాల్లో ఆటోనే సరైన రవాణా మార్గంగా భావించి గౌతమ్ బృందం ఈ వాహనాన్ని రూపొందించింది. అంతేకాదు ఫస్ట్ వేవ్ సమయంలో ‘కరోనా హెల్మెట్ డిజైన్ చేసింది అతడే కావడం విశేషం. సామాజిక ప్రచారాలను కూడా నిర్వహించే గౌతమ్, శానిటరీ ప్యాడ్‌లపై జీఎస్టీని తొలగించాలని తెలుపుతూ, ఓ ఆర్ట్ వేసి అందరిలోనూ అవేర్‌నెస్ తీసుకొచ్చాడు.
‘జూన్ 25 నుంచి వ్యాక్సిన్ అవేర్‌నెస్ డ్రైవ్ మొదలుపెట్టాం. కొవిడ్ నిబంధనలతో పాటు టీకా గురించిన ఆడియోను ఇందులో నిరంతరాయం ప్లే చేస్తాం. వాలంటీర్లు ఎక్కడికి వెళ్లినా కరపత్రాలను పంపిణీ చేస్తారు. ఆటోలపై బ్యానర్లు కట్టి, మైకుల పెట్టి ప్రచారం నిర్వహించడం పాత పద్ధతే కానీ మా వ్యాక్సిన్ ఆటో ప్రజలను ఆకర్షిస్తుంది. అంతేకాదు చాలామంది ఆటోను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో మరింత ఆదరణ లభిస్తుంది’ అని గౌతమ్ తెలిపారు.