- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో థర్డ్ వేవ్ వార్నింగ్.. రెడీ అంటున్న సెంట్రల్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ను నివారించవచ్చునని కేంద్రం తెలిపింది. అందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి మీడియా సమావేశంలో ఈ మేరకు తెలిపింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ కే విజయ్ రాఘవన్ మాట్లాడారు. ‘ఒకవేళ మనం కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్ వేవ్ రాకపోవచ్చు. ఇక్కడే కాదు.. ఎక్కడా రాకపోవచ్చు. కరోనా కట్టడి చర్యలు, గైడ్‌లైన్స్‌లను ఎంత ప్రభావవంతంగా అమలు చేశామన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా స్థానికంగా, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వీటి అమలు కీలకం’ అని వివరించారు. ఇటీవలే ఆయన దేశంలో థర్డ్ వేవ్‌పై హెచ్చరించారు. కరోనా వైరస్ మార్చుకుంటున్న కొత్త రూపాలు, కొత్త వేరియంట్ల దృష్ట్యా థర్డ్ వేవ్ వచ్చే ముప్పు ఉన్నదని, అందుకు సంసిద్ధమై ఉండాలని ఆయన సూచించారు. థర్డ్ వేవ్ అనివార్యంగా మారవచ్చునని పేర్కొన్నారు. అది ఎప్పుడు వస్తుందనేది? దాని తీవ్రత ఏమిటనేది? ఇప్పుడే చెప్పలేమని వివరించారు.