- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారం, డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసం.. చివరికి
దిశ, కల్వకుర్తి: మీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారాన్ని పూజలు చేసి రెట్టింపు చేస్తామని మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబాలను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్టానికి చెందిన తారక్ నాద్, గుజరాత్ రాష్టానికి చెందిన దిలీప్ నాద్ ఇద్దరు హైదరాబాద్ లో కలుసుకొని స్నేహితులయ్యారు. ఈ 14న కల్వకుర్తి పట్టణానికి భిక్షాటన కు వచ్చిన వీరిద్దరు బొక్కల కుంట సమీపంలోని శ్రీపురం ఆనంద్ ఎలక్ట్రానిక్ షాపు యజమాని వద్దకు వెళ్లి మాకు ఫేస్ రీడింగ్ తెలుసు.. మేము నీ ఫేస్ రీడింగ్ చెప్తామని అతన్ని నమ్మించారు. నువ్వు కష్టాల్లో ఉన్నావు నీకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.. మేము పూజలు చేసి నీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పడేవిధంగా చేస్తామని నమ్మబలికారు. షాపు యజమాని నుంచి 25 వేల రూపాయలు తీసుకుని మా గురువును తీసుకువచ్చి పూజలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు ఈనెల 18న షాపు యజమాని ఇంటికి వెళ్లి పూజల పేరుతో కావాల్సిన సామాగ్రిని తెప్పించారు. ఉన్న డబ్బులను రెట్టింపు చేస్తామని మభ్యపెట్టి డబ్బులు తీసుకొని డబ్బులు రెట్టింపు అయ్యే విధంగా ఆశ చూపించారు. ఇంకా మీ వద్ద ఉన్న బంగారం నగలు కూడా తీసుకురండి దాన్ని కూడా రెట్టింపు చేస్తామనడంతో వారు ఆశపడి తమ వద్ద ఉన్న రెండు తులాల బంగారాన్ని ఒక కుండలో వేశారు. కుండలో వేసిన బంగారాన్ని యజమానులకు తెలియకుండా అపహరించారు. మేము చెప్పినప్పుడు మాత్రమే కుండను తెరవాలని, లేకుంటే అందులో ఉన్న శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది అని భయపెట్టారు.
అనంతరం ఆ దొంగలు అక్కడినుంచి వెళ్లి పోయారు. బాధితులు వారిని సంప్రదించగా కుండను ఇప్పుడే తెరవద్దు. అందులో శక్తి ఉంటుంది దాన్ని శాంతింప చేయాలంటే మేం విభూతి తెస్తాం.. దాని విలువ రూ.70వేలు ఉంటుంది అని చెప్పి ఆ డబ్బులు గూగుల్ పే ద్వారా పంపాలని సూచించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు కుండను తెరిచి చూడగా అందులో ఏమీ లేక పోవడంతో అవాక్కయ్యారు. మోసపోయామని గ్రహించి స్థానిక పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా డీఎస్పీ గిరిబాబు, సీఐ సైదులు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా హైదరాబాద్ లోని ఉప్పల్ పరిసరాల్లో తిరుగుతున్న దొంగ స్వాములను పట్టుకొని వారివద్ద నుంచి రూ.25 వేలు నగదు, రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ముజీబ్, రాజవర్ధన్ రెడ్డిలను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు.