- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతిలో వాళ్లే టాప్.. రిపోర్టు రిలీజ్ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ కార్యాలయల్లో లంచం ఇవ్వకపోతే ఎలాంటి పనులు అవ్వడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నివేదికలో వెల్లడించింది. రెండు తెలుగు రాష్టాల్లో నిజాయితీగా పనిచేసే అధికారులు 20 శాతం మాత్రమే ఉన్నారని, అవినీతి అధికారులు 80 శాతం మంది ఉన్నారని తెలిపింది. బ్రోకర్ల వ్యవస్థ ద్వారనే అవినీతి పెరగడానికి ప్రధాన కారణమని 92 శాతం ప్రజలు అభిప్రాయ పడ్డారని సర్వేలో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి ఉందని 90 శాతం ప్రజలు సమాధానమిచ్చారని పేర్కొన్నది. రెవెన్యూ విభాగంలో అవినీతి ఎక్కువగా 85 శాతంగా ఉందని, రాజకీయ నాయకుల ద్వారా అవినీతి 80 శాతంగా రెండో స్థానం, మూడవ స్థానంలో పోలీస్ విభాగంలో అవినీతి 79 శాతంగా ఉందని ప్రజాభిప్రాయ సేకరణ సర్వే లో తేలిందని ఆ సంస్థ వెల్లడించింది. అవినీతి నిర్మూలన కోసం యాంటీ కరప్షన్ బ్యూరో, విజిలెన్స్ కమిషన్ వంటివాటిపై ప్రజలకు నమ్మకం పోయిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, అవినీతి పై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ సర్వేను విడుదల చేశారు. సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ.. సర్వే లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 21,523 వేల ప్రజలు పాల్గొన్నారని, ప్రజాభిప్రాయ సేకరణ ముఖాముఖీతో పాటు ఆన్‌లైన్ ద్వారా సర్వే నిర్వహించామన్నారు.
ఈ సందర్భంగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ సర్వే ప్రకారం అవినీతిలో భారతదేశం 86 స్థానం ఉందని, గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆరు శాతం పెరిగిందని అన్నారు. ప్రభుత్వ అధికారికి ప్రజలకు కాంటాక్ట్ అనేది ఉండకుండా ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించి ప్రజల పనులు జరిపించినప్పుడే అవినీతిని అంతం అవుతుందని అన్నారు. ఇన్‌కంట్యాక్స్ విభాగం ఎలాగైతే అన్‌లైన్ చేశారో ప్రతి విభాగానికి టెక్నాలజీ ఉపయోగిస్తే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుందని అన్నారు. ఎవరైన లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కేంద్రంలో అయితే సీబీఐకి ఫిర్యాదు చేయాలన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు అందరూ కృషి చేయాలని అన్నారు.