52 చైనా యాప్‌లపై నిషేధం ?

by vinod kumar |   ( Updated:2020-06-18 06:34:16.0  )
52 చైనా యాప్‌లపై నిషేధం ?
X

దిశ, వెబ్‌డెస్క్ :
భారత్, చైనా సరిహద్దుల్లో కొద్ది నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్‌కు చైనాయే కారణం అని వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే అంశం తెరమీదకు వచ్చింది. చాలా మంది చైనా యాప్స్, వస్తువులు వాడొద్దంటూ సోషల్ మీడియా వేదికగా నిరసనలు తెలియజేశారు. తాజాగా సరిహద్దులో చైనా సైన్యం దాడి చేసిన ఘటనలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందగా.. ఈ క్రమంలో భారతీయులు చైనాపై మండిపడుతున్నారు. ప్రభుత్వం చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు యావత్ భారతాన వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశం త‌యారుచేసిన ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడు చైనా యాప్స్ కూడా నిషేధించాలని అటు భారతీయులు కోరుతుండగా, ఇటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ప్రభుత్వాన్ని కోరాయి.

చైనాకు చెందిన యాప్స్ మొత్తంగా 52 ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల మొబైల్స్‌ స్టోర్‌లలో ఉన్న చైనా యాప్స్‌లో లిస్టు ఇదే.

TikTok
Vault-Hide
Vigo Video
Bigo Live
Weibo
WeChat
SHAREit
UC News
UC Browser
BeautyPlus
Xender
ClubFactory
Helo
LIKE
Kwai
ROMWE
SHEIN
NewsDog
Photo Wonder
APUS Browser
VivaVideo- QU Video
Perfect Corp
CM Browser
Virus Cleaner (Hi Security Lab
Mi Community
DU recorder
YouCam Makeup
Mi Store
360 Security
DU Battery Saver
DU Browser
DU Cleaner
DU Privacy
Clean Master – Cheetah
CacheClear DU apps studio
Baidu Translate
Baidu Map
Wonder Camera
ES File Explorer
QQ International
QQ Launcher
QQ Security Centre
QQ Player
QQ Music
QQ Mail
QQ NewsFeed
WeSync
SelfieCity
Clash of Kings
Mail Master,
Mi Video call – Xiaomi
Parallel Space

Advertisement

Next Story