ఠాణాల్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు

by Sridhar Babu |
ఠాణాల్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు
X

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తల్లో భాగంగా కరీనంగర్ కమీషనరేట్ లో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నుం;f తరుచూ థర్మల్ స్క్రీనింగ్, ఆక్సీ మీటర్లతో పల్స్ రేటింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పోలీసు సిబ్బందికి మాత్రమే చేపట్టిన ఈ విధానం ఇక నుండి ఠాణాలకు వచ్చే సాధారణ ప్రజలకు కూడా అమలు చేయనున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో పాటు, స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరిని పరీక్షించిన తరువాత మాస్క్ ఉంటేనే లోపలకు అనుమతించనున్నారు. ఈ పరీక్షల్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న అనుమానం కలిగితే వెంటనే వారిని కరీంనగర్ లోని సివిల్ ఆసుపత్రికి తరలించనున్నారు. స్టేషన్ లోకి అడుగుపెట్టే వారు ఎవరైనా సరే ఈ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, వారిని పరీక్షించిన తరువాతే అనుమతించాలని సీపీ కమలాసన్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం అవుతూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. దీనివల్ల కరోనా లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని, పోలీసులు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అలెర్ట్ చేసినట్టవుతుందని, స్టేషన్ కు వచ్చే సాధారణ పౌరులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నామన్న భరోసా కల్పించినట్టవుతుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed