రద్దీ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్

by Sridhar Babu |   ( Updated:2023-12-16 16:32:51.0  )
రద్దీ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్
X

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా అధికారులు రద్దీ ప్రాంతాల్లో టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తుంది. ఇన్నిరోజులు కంటైన్మెంట్ ఏరియాలకే పరిమితం అయిన పరీక్షలు ఇకనుంచి బ్యాంకులు, మార్కెట్లు, వ్యాపార కూడళ్ల వద్ద కూడా జరగనున్నాయి. వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు ఈ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఉన్నట్లయితే వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని కాంటాక్టు అయినవారు, వారిని సెకండ్ కాంటాక్టు అయిన వారి నుండి కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా అన్ని ప్రాంతాల్లో థర్మలో స్క్రీన్ టెస్ట్‌లు చేస్తున్నారు. రహదారులపై పోలీసులు కూడా స్క్రీన్ టెస్ట్‌లు చేస్తున్నప్పటికీ రద్దీగా ఉన్న చోట్ల వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం చేపడుతోంది.కరీంనగర్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్‌లో థర్మల్ స్క్రీన్ టెస్టులను చేపట్టారు. ప్రభుత్వం ఇస్తున్న 1500 రూపాయల కోసం లబ్దిదారులు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు వెళ్తున్నందున అక్కడ కూడా పరీక్షలు చేస్తున్నారు. కరీంనగర్‌‌కు చెందిన ఒకరికి 29రోజులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జల్లా కలెక్టర్ శశాంక ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగానే రద్దీ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింట్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. అలాగే కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలందించే విషయంలో కూడా ప్రత్యేక నిబంధనలు విధించారు. కేవలం ఔట్ పేషెంట్ పద్ధతిలో చికిత్స అందించాలే తప్ప ఇన్ పెషెంట్ విధానం మాత్రం అమలు చేయడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు.

అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు.. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి రోగులను పరీక్షించేందుకు వేర్వేరుగా ఓపీ నిర్వహించాలన్నారు. జనరల్ పేషెంట్లను వేరుగా టెస్ట్‌లు చేయాలని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడే వారిని అడ్మిట్ చేసుకోకూడదని కలెక్టర్ సూచించారు. ఈ వ్యాధుల బారిన పడ్డ వారిని గవర్నమెంట్ హాస్పిటల్‌కు ఖచ్చితంగా పంపిచాల్సిందేనని స్పష్టం చేశారు. వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉన్నందున శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి కేసుల యొక్క వివరాలను ఐడిఎస్ పి. డాక్టర్ జ్యోతీ, ఎస్.ఎం.ఓ. డాక్టర్ నాగ శేఖర్‌లకు అందించాలని కలెక్టర్ కోరారు.

tags: Thermal Screening, Medical Health Department, RTC Bus Station, Police, Karimnagar, Banks, Collector Shashanka, Private Hospitals

Advertisement

Next Story