ఎయిమ్స్‌కు నీళ్లేవి..జగన్‌ను లేఖతో కడిగేసిన నారా లోకేష్

by srinivas |
nara-lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మంగళగిరి ఎయిమ్స్‌కి నీటి సరఫరా జాప్యాన్ని లేఖలో ప్రస్తావించారు. ఎయిమ్స్‌కు కృష్ణా నీటిని సరఫరా చేయడానికి 2017లో రూ.10 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఆమోదించబడింది. 2018లో పాలనా పరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి. గత రెండేళ్ల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఎయిమ్స్‌కు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.

నీటి కొరత కారణంగా కొవిడ్‌పై జరిగిన పోరాటంలో ముందుండాల్సిన ఎయిమ్స్ వెనుకబడింది. ఎయిమ్స్ ఏపీతో పాటు దక్షిణ భారతదేశంలోనే ప్రజలకు ఉత్తమ సేవలందించే ప్రతిష్టాత్మక రెండు సంస్థలో ఒక్కటి. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఎన్ హెచ్ 16కి ఎయిమ్స్ అనుసంధానం, కృష్ణా నీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్నాయి. మంగళగిరి లేదా తెనాలి కాలువ ద్వారా పైప్‌లైన్‌తో నీటి సరఫరా సమస్యను పరిష్కరించమని ఎయిమ్స్ డైరెక్టర్ ఇప్పటికే సీఎంను కోరారు. ఎయిమ్స్‌ని వెంటాడుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేఖలో లోకేశ్ కోరారు.

Advertisement

Next Story