హైడ్రాక్సీ క్లోరోక్వీన్ సరిపడా ఉన్నది : కేంద్రం

by Shamantha N |
హైడ్రాక్సీ క్లోరోక్వీన్ సరిపడా ఉన్నది : కేంద్రం
X

న్యూఢిల్లీ: మన దేశ అవసరాలకు తగినంతగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రల నిల్వలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే కాదు.. భవిష్యత్తుకూ సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని, ఈ మాత్రల నిల్వలపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. డ్రగ్ ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన రెండు వారాల తర్వాత.. తమకు ఈ మందులు సరఫరా
చేయకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత గంటల వ్యవధిలో కొవిడ్ 19తో తీవ్రంగా బాధపడుతున్న దేశాలకు ఈ డ్రగ్ సరఫరా చేస్తామని, ఔషధాల ఎగుమతుల నిషేధంపై కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రాల కొరత లేదని తాజాగా, కేంద్ర ఆరోగ్య శాఖ ఈ స్పష్టతనిచ్చింది

ఢిల్లీలో బుధవారం విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘నిన్నఒక్క రోజే కొత్తగా 773 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 32 మందిని ఈ మహమ్మారి బలిగొంది. మొత్తంగా దేశంలో కరోనా మృతుల సంఖ్య 149కి చేరింద’ని చెప్పారు. కాగా, కరోనా కేసుల సంఖ్య ఐదు వేల మార్కును దాటి 5,194కు చేరిందని వెల్లడించారు. ఇందులో 402 మంది చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆస్పత్రుల నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించాలని, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినట్టు వివరించారు.

1,21,271 మందికి కరోనా టెస్టులు చేశాం: ఐసీఎంఆర్ దేశంలో ఇప్పటి వరకు జరిపిన కరోనా టెస్టుల సంఖ్య లక్షా ఇరవై వేలకు చేరింది. మొత్తం 1,21,271 మందికి కరోనా పరీక్షలు జరిపినట్టు ఇండియన్
కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రతినిధి ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. మనదేశంలో మరణాల సంఖ్య స్వల్పంగా ఉన్నదని వివరించారు. ఈ వ్యాఖ్యను మహారాష్ట్రను ఉదాహరణగా చూపెట్టి
కొట్టివేయరాదని చెప్పారు. నిర్మాణ రంగ కార్మికులుగా నమోదైనవారికి రూ. 1000 నుంచి రూ. 6000ల వరకు ఆర్థిక సహాయాన్ని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించాయని లవ్ అగర్వాల్ తెలిపారు. రూ. 3000ల ఆర్థిక సహకారాన్ని సుమారు రెండు కోట్ల మంది రిజిస్టర్డ్ నిర్మాణ రంగ కార్మికులకు అందజేసినట్టు వివరించారు.

Tags: coronavirus, health ministry, hydroxy chloroquine, exports, shortage, cases

Advertisement

Next Story

Most Viewed