రాష్ట్రంలో దమ్మున్న ఎంపీ ఒక్కరూ లేరు

by srinivas |
CPI Ramakrishna
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విశాఖలోని అన్ని భూములను అక్రమార్కులు కాజేసి అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో భూములన్నీ అమ్మేస్తుంటే మరి శ్మశానంలో పరిపాలన రాజధాని పెడతారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన రాజధాని పేరుతో విశాఖను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక మంత్రిని…అప్పుల మంత్రిగా మార్చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ, వైసీపీ అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ నాటకాలు ఆడుతుందని ఎద్దేవా చేశారు. విశాఖలో మాత్రం వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని నేతలు ప్రకటిస్తున్నారని, కానీ ఢిల్లీలో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ఏనాడైనా వైసీపీ ఎంపీలు పీఎం నరేంద్ర మోడీని కలిశారా అని ప్రశ్నించారు. మోదీ వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీశారా అని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దమ్మున్న ఎంపీ ఒక్కరూ లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed