‘భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి’

by Anukaran |
‘భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి’
X

న్యూఢిల్లీ: కరోనా సామాజిక వ్యాప్తి ఉనికిలో ఉన్నదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. ఈ మహమ్మారి కమ్యూనిటీల గుండా వ్యాప్తి చెందుతున్నదని, అయితే, సాంకేతికంగా దీన్ని స్థానిక వ్యాప్తి అనాలా? సామాజిక వ్యాప్తి అనాలా? అనే తర్జనభర్జన ఉన్నదని తెలిపారు. చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత ఎవరి నుంచి సోకిందో తెలియడం లేదని వివరించారు. సామాజిక వ్యాప్తిలో ఎవరి(సోర్స్) నుంచి సోకుతుందో తెలియని స్థితి ఉంటుందని తెలిసిందే. అయితే, సామాజిక వ్యాప్తిపై గొడవను కేంద్రానికి వదిలేద్దామని అన్నారు. కరోనా బారిన పడిన సత్యేందర్ జైన్ సుమారు నెల తర్వాత మళ్లీ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. గతనెల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఢిల్లీ మ్యాక్స్ హాస్పిటల్‌లో చేరారు. అనంతరం ప్లాస్మా థెరపీతోనే కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ సత్యేందర్ జైన్ వైరస్ నుంచి కోలుకున్నారని, ఈ రోజు(సోమవారం) నుంచి విధుల్లో చేరుతారని వివరించారు. దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed