- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు!
దిశ, సెంట్రల్ డెస్క్: మరోసారి వాహనదారులకు పెట్రో సెగ తగలనుంది. జూన్ నెలలో పెట్రోల్ లీటరుకు సుమారు ఐదు రూపాయలు పెరిగే అవకాశముంది. లాక్‌డౌన్ ఎత్తేయగానే పెట్రోలియం సంస్థలు ధరలను రోజువారీగా సమీక్షించనున్నాయి. గత వారం ఇంధన రిటైలర్లు సమావేశమైనట్టు, రోజూవారీ ఇంధన ధరల పెంపు గురించి చర్చించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు(ఓఎమ్‌సీ) పేర్కొన్నాయి. ఒకవేళ లాక్‌డౌన్ కొనసాగినప్పటికీ రోజువారీ ధరల సమీక్ష కొనసాగనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ధరల సమీక్షకు అనుమతిస్తే ఇన్ని రోజులు ఖర్చు కంటే తక్కువకు విక్రయించి తెచ్చుకున్న నష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఓఎమ్‌సీలు భావిస్తున్నాయి. లాక్‌డౌన్ కొనసాగించినప్పటికీ సడలింపులు ఉంటాయని, మార్కెట్ నిర్ణయించిన ధరలకే ఇంధనాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని వారు ఆశిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేనందున, రానున్న రెండు వారాలు రోజుకు 40 నుంచి 50 పైసలు పెంచినా తక్కువ కాలంలో నష్టాల నుంచి బయటపడొచ్చని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొనుగోలు, విక్రయంలో లీటరుకు నాలుగు నుంచి ఐదు రూపాయల వ్యత్యాసం ఉన్నందున ఈ ఆలోచన చేస్తున్నాయి. ధరల సమీక్షకు ప్రభుత్వం అనుమతిచ్చినా స్థాయి దాటి పెంపుదలకు అనుమతివ్వకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీన్నిబట్టి కొనుగోలు, విక్రయం మధ్య గరిష్టంగా 20 నుంచి 40 పైసల వరకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతివ్వచ్చని చెబుతున్నారు.