- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గన్నీ బ్యాగుల కోసం గిన్ని తిప్పలా?
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజనూ, చివరి వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు అధికారులు గ్రామాల్లో
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ, ఈ కేంద్రాలను నమ్ముకుంటే తమ పరిస్థితి ఆగం అయేటట్లు ఉందని జిల్లా రైతులు అంటున్నారు. అధికారులు టోకెన్లు ఇచ్చి కొనుగోలు మరిచినట్టు కనబడుతుందని చెబుతున్నారు. అంతేగాకుండా రైతులు మొదట టోకెన్ల కోసం, ఇప్పుడు గోనెసంచుల
(గన్నీబ్యాగులు) కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు.
అధికారులతో వాగ్వాదం..
ఈ క్రమంలో కొంత మంది రైతులు ఇక వేచి ఉండటం మా వల్ల కాదు అని ఏకంగా కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీబ్యాగుల కోసం సామాజిక దూరం మరిచి గుంపులుగుంపులుగా గుమిగూడుతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒక వైపు అకాల వర్షం తమను భయపెడుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మరి కొంతమంది ఇక లాభం లేదని దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. బుధవారం మక్తల్ నియోజకవర్గ పరిధిలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు గన్నీ బ్యాగుల కోసం బారులు తీరారు. తమ పరిస్థితి ఏంటని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలనీ, తగు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
Tags: crop buying centres , availability, gunny bags, covid 19 effect, lock down