- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఆ మూడు జిల్లాలతోనే తలనొప్పి
దిశ, తెలంగాణ బ్యూరో :
దేశవ్యాప్తంగా యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా తగ్గి 8 లక్షలకు చేరుకుంది. ఒక దశలో పది లక్షల వరకూ ఉన్న యాక్టివ్ పాజిటివ్‌లు ఇటీవలి కాలంలో రికవరీ పెరగడంతో తగ్గుముఖం పట్టింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోనే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కేసులు నమోదుకాగా గత కొన్ని వారాలుగా ఈ మూడు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది.
తాజా గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద 73.70 లక్షల పాజిటివ్ కేసులు నమోదైనా అందులో సుమారు 64.53 లక్షల మంది కోలుకోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8.04 లక్షలకు పడిపోయింది. గడచిన 24 గంటల్లో 895 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 1.12 లక్షలు దాటింది. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికీ ఐదు వేల కంటే ఎక్కువ చొప్పున కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడితే దేశ సగటు కొత్త కేసుల నమోదు కూడా గణనీయంగా తగ్గుతుంది.
తెలంగాణలో ఇప్పటికీ మూడు జిల్లాల్లో ఎక్కువ కేసులు
హైదరాబాద్ నగరంతో పాటు పక్కనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రతీరోజూ కొత్త కేసుల సంఖ్య ఇతర జిల్లాలకంటే ఎక్కువగా నమోదవుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 249 కొత్త కేసులు తాజాగా నమోదుకాగా రంగారెడ్డి జిల్లాలో 128, మేడ్చల్ జిల్లాలో 118 చొప్పున నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో వంద కంటే తక్కువగానే ఉన్నాయి. కొత్తగూడెం, కరంనీగర్, ఖమ్మం, నల్లగొండ, తదితర జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గినా వైరస్ వ్యాప్తి మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో అదుపులోకి రాలేదు. గడచిన 24 గంటల్లో ఏడుగురు కరోనా కారణంగా చనిపోవడంతో మృతుల సంఖ్య 1,256కు చేరుకుంది. బతుకమ్మ పండుగ సీజన్, దుబ్బాకలో ఎన్నికల క్యాంపెయిన్ కారణంగా కొత్త కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజారోగ్య శాఖ ఆందోళన పడుతోంది.